తైక్వాండో పోటీల్లో రాజాపేట విద్యార్థుల ప్రతిభ
రాజాపేట : హైదరాబాద్‌లో ఆదివారం రాణి రుద్రమాదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే, తైక్వాండో పోటీల్లో మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన అక్షయ, అన్విత, సాహిత్య, భవాణి, శ్రీవళ్లి, రమ్య, వైష్ణవి పాల్గొని ప్రతిభ కనబర్చి ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజు తెలిపారు. విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు అభినందించారు.


