రైతుల కష్టాలు తీరనున్నాయ్..
ఎన్ని రోజులైనా ధాన్యం నిల్వ చేసుకోవచ్చు
ఎమ్మెల్యే ఐలయ్యకు కృతజ్ఞతలు
దాతర్‌పల్లిలో ఆధునిక హంగులతో కూడి ఇంటిగ్రేటెడ్ గోదాములను నిర్మిస్తుండటం హర్షణీయం. ఆలేరు నియోజకవర్గ రైతులకే కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల రైతులు తాము పండించిన ధాన్యాన్ని భద్రపరుచుకోవడానికి ఉపయోగకరంగా ఉంటాయి. పంట ఉత్పత్తులను నిల్వ ఉంచి మద్దతు ధర వచ్చిన తరువాతే అమ్ముకోవచ్చు. ఈ ప్రాంత అభివృద్ధికి కూడా దోహదపడుతాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇంటిగ్రేటెడ్ గోదాములు మంజూరుకు చొరవ చూపిన నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ధన్యవాదాలు.
–కాల్నె భాస్కర్, దాతర్‌పల్లి
దాతరుపల్లిలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ గోదాముల పనులను రానున్న రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తాం. ఆ విధంగానే అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యాధునిక ప్రమాణాలతో గోదాములు నిర్మిస్తాం. ఇప్పటికే పనులు ప్రారంభించాం.
–నరేందర్, కాంట్రాక్టర్
యాదగిరిగుట్ట రూరల్: జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో ధాన్యం నిల్వ రైతులకు పెద్ద సమస్యగా మారింది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అధునాతన గోదాములు నిర్మించాలని నిర్ణయించింది. అందులో భాగంగా యాదగిరిగుట్ట మండలం దాతర్‌పల్లిలో ఇంటిగ్రేటెడ్ గోదాములను నిర్మిస్తుంది. గోదాముల పనులకు గిడ్డంగుల సంస్థ అధికారులు ఇటీవల శ్రీకారం చుట్టారు. ఇవి అందుబాటులోకి వస్తే రైతుల కష్టాలు తీరనున్నాయి.
రెండేళ్ల గడువు
దాతర్‌పల్లిలో 13 ఎకరాల స్థలంలో 20 వేల మెట్రిక్
టన్నుల సామరథ్యంతో ఇంటిగ్రేటెడ్ గోదాములు నిర్మిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ,22.75 కోట్లు మంజూరు చేసింది. ఇట్టి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఏడాది జూన్ నెలలో వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. గోదాముల నిర్మాణాన్ని రెండేళ్ల కాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
అధునాతనంగా..
పంట ఉత్పత్రుతల భద్రత, రవాణాకు అనుకూలంగా, పర్యావరణ హితంగా మాత్రమే కాక.. సౌర విద్యుత్, డిజిటల్ సాంకేతికతతో గోదాములను నిర్మించబోతున్నారు. వీటిలో ధాన్యం నిల్వ చేసిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తబోవని అధికారులు అంటున్నారు. రైతులకు ధాన్యం తడిసిపోవడం, తేమ పెరగడం వంటి సమస్యలు తీరుతాయి.
దాతర్‌పల్లిలో 13 ఎకరాల విస్తీర్ణంలో గోదాముల నిర్మాణం
ఫ 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం..
ఫ రూ.22.75 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
ఫ ప్రారంభమైన పనులు
ఇంటిగ్రేటెడ్ గోదాములలో రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను ఎన్ని రోజులైనా భద్రపరుచుకునేందుకు వీలుంటుంది. దళారులకు అమ్ముకోకుండా నిల్వ ఉంచుకుని మద్దతు ధర వచ్చినప్పుడు విక్రయించుకోవచ్చని అధికారులు అంటున్నారు. ఎఫ్‌సీఐ, సివిల్ సప్‌లై శాఖలు సైతం తమ ధాన్యాన్ని నిల్వ ఉంచడానికి గోదాములు ఎంతగానో దోహదపడనున్నాయి. గోదాముల వల్ల ఈ ప్రాంత ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ప్రారంభంలో 150 మంది వరకు హమాలీలు, కూలీలతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నిత్యం 100 లారీలు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి గోదాములు దోహదపడనున్నాయి. గోదాముల నిర్మాణంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల కష్టాలు తీరనున్నాయ్..
రైతుల కష్టాలు తీరనున్నాయ్..


