మూడో విడతలోనూ జాగ్రత్త
గుండాల : తొలి, మలి విడతల మాదిరిగానే మూడో దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించి పోలింగ్ పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు సూచించారు. గుండాల మండలం పరిషత్ కార్యాలయాన్ని సోమవారం ఆయన సందర్శించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాట్లు, పోలింగ్ సామగ్రిని పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో, పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలింగ్ అధికారులకు సూచనలు చేశారు. మొదటి, రెండో దశలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, అందుకు అధికారులు అహోరాత్రులు శ్రమించారని, వారికి అభినందనలు తెలిపారు.
ఆకట్టుకునేలా మోడల్ పోలింగ్ కేంద్రాలు
ఓటర్లను ఆకట్టుకునేలా మోడల్ పోలింగ్ కేంద్రాలను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. హరిత, ప్లాస్టిక్‌రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు నూతన పాలకవర్గాలు కృషి చేయాలని కోరారు.


