నిబంధన తొలగి.. బరిలో నిలిచి.. గెలిచి
భూదాన్‌పోచంపల్లి : ఇద్దరికి మించి సంతానం ఉన్న వారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులనే నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయడంతో పలువురు బరిలోకి దిగారు. రెండో విడతలో భూదాన్‌పోచంపల్లి మండలంలోని పెద్దరావులపల్లి నుంచి సర్పంచ్ పోటీలో నిలిచిన కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మోటె బాలకృష్ణ గెలుపొందాడు. బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థిపై 417 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించాడు. ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేయడంతో బాలకృష్ణకు సర్పంచ్‌గా పోటీచేసే అవకాశం వచ్చింది. ఇద్దరు సంతానం ఉన్న సమయంలోనూ బాలకృష్ణ సర్పంచ్‌గా పోటీ చేసి స్వల్పతేడాతో ఓడిపోయాడు.
పొరపాట్లకు తావుండరాదు
మోటకొండూర్: తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా, తొలి విడత ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. సోమవారం మోటకొండూరులోని రైతువేదిక వద్ద ఎన్నికల సిబ్బందికి పోలింగ్ నిర్వహణపై అవగాహన కల్పించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలుకొని ఫలితాలు వెల్లడించే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందే బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర సామగ్రిని ఒకటికి రెండు సార్లు సరి చూసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగదివ్య, ఎంపీడీఓ ఇందిర, కేతిరెడ్డి రఘురాంరెడ్డి పాల్గొన్నారు.
జాతీయ స్థాయి పోటీలకు మర్యాల విద్యార్థి
బొమ్మలరామారం : మండలంలోని మర్యాల జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి డి.ప్రవళ్లిక జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై ంది. చౌటుప్పల్ మండలం పంతంగిలో జరిగిన రాష్ట్రస్థాయిలో పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జట్టు తరఫున ఆడి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోద్యలో ఈనెల 20నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో అండర్–17 బాలికల విభాగం నుంచి ప్రవళ్లిక ప్రాతినిథ్యం వహించనున్నట్లు పాఠశాల హెచ్‌ఎం పగిడిపల్లి నిర్మల జ్యోతి తెలిపారు. డీఈఓ సత్యనారాయణ, జిల్లా యువజన క్రీడల అధికారి ధనుంజనేయులు, ఎంఈఓ రోజారాణి, పాఠశాల ఉపాధ్యాయ బృందం సోమవారం ప్రవళ్లికను అభినందించింది. కార్యక్రమంలో హెచ్‌ఎం నిర్మల జ్యోతి, ఉపాధ్యాయులు స్వరూపరాణి, గంగరాజు సిద్దులు, రాజు, గోపాల్ ముఖిద్, రవీశ్వర్, సుజాత, శోభ, శ్రీధర్, నాగజ్యోతి, శ్రీదేవి, సుష్మ, మంజుల, భవాని, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కుష్ఠువ్యాధి రహిత జిల్లాగా మార్చుదాం
భువనగిరి : కుష్ఠివ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ మనోహర్ అన్నారు. సోమవారం భువనగిరిలోని పాత మున్సిపల్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా కుష్ఠి వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 1,87,062 ఇళ్లలో 7,64,812 మందికి పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 169 మంది పర్యవేక్షణలో 687 బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించి వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తిస్తారని చెప్పారు. వారికి ఉచితంగా చికిత్స, మందులు అందజేయనున్నట్లు తెలిపారు.
నిబంధన తొలగి.. బరిలో నిలిచి.. గెలిచి
నిబంధన తొలగి.. బరిలో నిలిచి.. గెలిచి


