పల్లెల్లో పాగా | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో పాగా

Dec 16 2025 4:45 AM | Updated on Dec 16 2025 4:45 AM

పల్లె

పల్లెల్లో పాగా

మూడు స్థానాల్లో ఆగిపోయిన ఎన్నికలు

రెండు విడతల్లోనూ అధికార పార్టీకే పట్టం

రెండో విడత ఎన్నికల్లో భాగంగా నల్లగొండ జిల్లాలోని మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో న్యాయ వివాదంతో ఎన్నికలు ఆగిపోయాయి. అదే మండలంలోని అభంగాపురంలో సర్పంచ్‌ స్థానం, అనుముల మండలంలోని పేరూరులో సర్పంచ్‌ స్థానం ఎస్జీలకు రిజర్వ్‌ కావడంతో.. అభ్యర్థుల్లేక ఎన్నికలు జరుగలేదు. దీంతో 3 గ్రామాల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలు ఆగిపోయాయి.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెండు విడతల్లో మూడు గ్రామాలు మినహా 1240 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు 772 స్థానాలను కై వసం చేసుకుని నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ కంచుకోట అని మరోసారి నిరూపించారు. ఇక, బీఆర్‌ఎస్‌ పార్టీ రెండు విడతల్లో 355 స్థానాలను దక్కించుకుని రెండో స్థానంలో ఉంది. బీజేపీ 13 స్థానాల్లోనే గెలుపొంది ప్రభావం చూపలేకపోయింది.

అధికార పార్టీకే అందలం..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు అధికార పార్టీనే అందలం ఎక్కించారు. మొదటి విడతలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల పరిధిలో 630 పంచాయతీల్లో, రెండో విడతలో 610 స్థానాల్లో.. రెండూ కలిపి 1240 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు మొదటి విడతలో 394 మంది, రెండో విడతలో 378 స్థానాల్లో విజయం సాధించారు. రెండు విడతల్లో 772 స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ కై వసం చేసుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు రెండు విడతల్లో 62.25 శాతం సర్పంచ్‌ స్థానాలు కై వసం చేసుకున్నారు.

బీఆర్‌ఎస్‌కు 28.63 శాతం స్థానాలు..

రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులు ఉమ్మడి జిల్లాలో 355 స్థానాలను దక్కించుకున్నారు. మొదటి విడతలో 186, రెండో విడతలో 169 స్థానాల్లో సర్పంచ్‌లుగా గెలుపొందారు. రెండు విడతల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు 28.63 శాతం స్థానాలు లభించాయి. ఇక, సీపీఎం, సీపీఐ, స్వతంత్రులకు వంద స్థానాలు (8.07 శాతం) లభించాయి. అందులో స్వతంత్రులే అత్యధికంగా ఉన్నారు. ఇక బీజేపీ మద్దతుదారులకు 13 స్థానాలు (1.05 శాతం) లభించాయి.

మొదటి విడతలో వివిధ పార్టీల మద్దతుదారులకు లభించిన స్థానాలు

జిల్లా జీపీలు కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ బీజేపీ సీపీఐ/సీపీఎం/

ఇతరులు

నల్లగొండ 318 213 79 3 23

సూర్యాపేట 159 92 55 3 9

యాదాద్రి 153 89 52 3 9

మొత్తం 630 394 186 9 41

రెండో విడతలో

జిల్లా జీపీలు కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ బీజేపీ సీపీఐ/సీపీఎం/

ఇతరులు

నల్లగొండ 282 194 67 1 17

సూర్యాపేట 181 114 40 2 25

యాదాద్రి 150 70 62 1 17

మొత్తం 613 378 169 4 59

ఫ 1,243 పంచాయతీల్లో 871 స్థానాలు దక్కించుకున్న హస్తం పార్టీ మద్దతుదారులు

ఫ మరోసారి కాంగ్రెస్‌కు కంచుకోట అని నిరూపించిన ఉమ్మడి జిల్లా

ఫ 355 స్థానాలతో రెండో స్థానంలో నిలిచిన బీఆర్‌ఎస్‌

ఫ బీజేపీకి వచ్చింది 13 స్థానాలే..

ఫ సీపీఐ, సీపీఎం, స్వతంత్రులకు నామమాత్రంగానే..

పల్లెల్లో పాగా1
1/1

పల్లెల్లో పాగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement