1,500 మందితో బందోబస్తు
సాక్షి,యాదాద్రి : రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో, సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం.. సివిల్, ఆర్ముడ్, రిజర్వ్ పోలీసులు 1,500 మంది బందోబస్తులో పాల్గొంటున్నారని చౌటుప్పల్ ఏసీపీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి తెలిపారు. రెండో విడత ఎన్నికల ఏర్పాట్లను సాక్షికి వెల్లడించారు. సున్నితమైన, అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఉంటుందని, ప్రత్యేక బలగాలను మొహరించినట్లు తెలిపారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటర్లు ఓటేయకుండా, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయన్నారు.
90 మంది
పాతనేరస్తుల బైండోవర్
ఎన్నికల నేపథ్యంలో రెండో విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో 90 మంది పాత నేరస్తులను బైండోవర్ చేశాం. అనుమానితులపై నిఘా ఉంచాం. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న 55 మందిపై కేసులు నమోదు చేశాం. సుమారు రూ.3.48 లక్షల విలువ చేసే 687 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నాం.
ఫలితాలు వెల్లడించే వరకు
పటిష్ట బందోబస్త్
పోలింగ్ సిబ్బందికి కేటాయించిన పంచాయతీలకు వెళ్లేటప్పుడు పోలీసు భద్రత కల్పించాం. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటించే వరకు కట్టుదిట్టమైన బందోబస్తు ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు.
ఫ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కట్టుదిట్టమైన నిఘా
ఫ ఓటర్లకు ఆటంకం కలిగించొద్దు
ఫ చౌటుప్పల్ ఏసీపీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి
13 బీఎన్‌జీ 01 :


