‘సీసీ’లో పర్యవేక్షించి.. సమస్యలు తెలుసుకొని
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈఓ వెంకట్రావ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయ విభాగాల్లో తిరుగుతూ, సీసీ టీవీలో పర్యవేక్షిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఆలయ పరిసరాలు, ముఖ మండపం, ప్రసాద వితరణ, పశ్చిమ రాజగోపురం వద్ద, భక్తులు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కొండపైన ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. శనివారం సీసీ పుటేజీలను పరిశీలించి భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వసతుల కల్పన, ప్రసాద వితరణ సజావుగా జరిగేలా చూడాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి సన్నధికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడటమే లక్ష్యమన్నారు.


