ఇంటి ముందు పెట్టిన స్కూటీ దగ్ధం
భూదాన్‌పోచంపల్లి : ఇంటి ఆరుబయట పార్కింగ్ చేసిన యాక్టివా స్కూటీపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్‌పోసి నిప్పంటి తగులబెట్టారు. ఈ ఘటన బుధవారం భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో జరిగింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దుర్గం మౌనిక మంగళవారం రాత్రి రోజు మాదిరిగానే తన ఇంటి ఆరుబయట యాక్టివా స్కూటీని పార్కింగ్ చేసి ఇంట్లో పడుకున్నారు. బుధవారం తెల్లవారుజామున లేచి చూసేసరికి యాక్టివాను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఘటనా స్థలంలో అగ్గిపెట్టె, కాల్చేసిన అగ్గిపుల్లలు ఉన్నాయి. వెంటనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి తగులబడిన యాక్టివాను పరిశీలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


