తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
హుజూర్‌నగర్ : తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చొరబడి 6 తులాల బంగారం, రూ.లక్ష నగదు అపహరించారు. ఈ సంఘటన హుజూర్‌నగర్ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ బండి మోహన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వేపల సింగారం గ్రామంలో ముడెం గోపిరెడ్డి, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. దీనిని గమనించిన దొంగలు ఇంటి తాళం తీసి ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న 6 తులాల బంగారు నగలు, రూ.లక్ష నగదును దోచుకెళ్లారు. ఆతర్వాత ఇంటికి వచ్చిన గోపిరెడ్డి దీనిని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఎస్‌ఐ క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఫ ఆరు తులాల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు అపహరణ


