జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక
మోత్కూరు : యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారని షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరు యాదయ్య తెలిపారు. బుధవారం ఆయన మోత్కూరులో విలేకరులకు వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురులో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ (అండర్ 19) షూటింగ్ బాల్ పోటీల్లో జిల్లా బాలబాలికల జట్లు ద్వితీయ స్థానంలో నిలిచాయన్నారు. ఇందులో జి.భానుసాయి గణేష్ రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా, అత్యుత్తమ ఆటతీరు కనబర్చిన ఆలేరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు బి.వసంత, జె.లహరి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాభాగ్‌లో జరగబోయే 44వ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక
జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక


