ముగిసిన రాష్ట్రస్థాయి మల్లఖంబ్ పోటీలు
చౌటుప్పల్ : 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో రెండ్రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి మల్లఖంబ్ క్రీడా పోటీలు బుధవారం రాత్రి ముగిశాయి. అండర్–14, 17 విభాగాల్లో రాష్ట్రంలోని ఏడు ఉమ్మడి జిల్లాల నుంచి జట్టుకు 24మంది చొప్పున 168మంది హాజరయ్యారు. గ్రూప్‌గా, వ్యక్తిగతంగా ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. ఒక్కో విభాగం నుంచి ఆరుగురు చొప్పున 24 మంది రాష్ట్ర జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరు ఈనెల 24, 25 తేదీల్లో మద్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో జరగనున్న జాతీయ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా డీఈఓ కె.సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు పాల్గొని మాట్లాడారు. జాతీయస్థాయి పోటీల్లో రాణించి రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావాలన్నారు. ట్రినిటీ విద్యాసంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రటరీ దశరథరెడ్డి, ఎంఈఓ గురువారావు, ట్రినిటీ స్కూల్ చైర్మన్ కేవీబీ.కృష్ణారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జిని మంజుల, క్రీడల రాష్ట్ర పరిశీలకుడు పి.అంజయ్య, లింగయ్య, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఫ ఏడు ఉమ్మడి జిల్లాల నుంచి రాష్ట్ర జట్లకు 24 మంది ఎంపిక
ఫ 24, 25 తేదీల్లో ఉజ్జయినీలో జరగనున్న
జాతీయ పోటీల్లో పాల్గొన నున్న క్రీడాకారులు
ముగిసిన రాష్ట్రస్థాయి మల్లఖంబ్ పోటీలు


