కుక్కను తప్పించబోయి కారు బోల్తా
మోతె : కుక్కను తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన బుధవారం ఉద యం సూర్యాపేట–ఖమ్మం హైవేపై మోతె మండలం మామిళ్లగూడెం సబ్‌స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా తాళ్లపుడి మండలం పోచవరం గ్రామానికి చెందిన అన్నపర్తి సాయిరాం వృత్తిరీత్యా వ్యాపారి. ఈయన తన కుటుంబ సభ్యులతో బుధవారం హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా తన సొంత తాళ్లపుడి గ్రామానికి కారులో బయలుతేరాడు. ఉదయం 6 గంటల సమయంలో మోతె మండలం మామిల్లగూడెం గ్రామం సబ్‌స్టేషన్ వద్దకు రాగానే జాతీయ రహదారి 365పై కుక్క అడ్డు రావడంతో సడన్‌గా కారు బ్రేకు వేశాడు. దీంతో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న సాయిరాం భార్య రాణి(38), కూతురు జాహ్నవి, కుమారుడు లోకేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో ఖమ్మంకు తరలిస్తుండగా మార్గమధ్యలో సాయిరాం భార్య రాణి మృతిచెంది. పిల్లల ఇద్దరు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. సాయిరాం ఫిర్యాదు మేకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు మోతె ఎస్‌ఐ అజయ్‌కుమార్ పేర్కొన్నారు.
ఫ ఆసుపత్రికి తరలిస్తుండగా మహిళ మృతి
ఫ ఆమె కుమారుడు,
కుమార్తెకు తీవ్ర గాయాలు
కుక్కను తప్పించబోయి కారు బోల్తా


