నీటి గుంతలో పడి వృద్ధుడు మృతి
నార్కట్‌పల్లి : ఇళ్ల మధ్యలో ఉన్న నీటి గుంతలో పడి వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం నార్కట్‌పల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని ఐతరాజు యాదయ్య ఇంటి సమీపాన సీసీ రోడ్డు వేయడంతో పక్కనే ఖాళీ స్థలంలో వర్షపునీరు చేరి పెద్ద నీటిగుంతలా తయారైంది. ఈ నీటిగుంతలో పడి ఒకరి మృతిచెందినట్లు సమీపంలోని వ్యక్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బుధవారం మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడు మండలంలోని శాపల్లి గ్రామానికి చెందిన జాల మల=్లయ్య (70)గా గుర్తించారు. జాల మల్లయ్య రెండు రోజుల క్రితం నార్కట్‌పల్లిలోని తన కుమారుడు ఇంటికి వస్తూ సీసీ రోడ్డు మీదుగా వెళ్తూ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న నీటి గుంతలో పడి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఎస్‌ఐ క్రాంతికుమార్ నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
విద్యుదాఘాతానికి ఒకరు మృతి
హుజూర్‌నగర్ : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఒకరు మృతి చెందిన సంఘటన హుజూర్‌నగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మొహన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన రాసమళ్ల కృష్ణ (40) స్థానిక ఐజల్ వాటర్ ప్లాంట్‌లో పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే డ్యూటీకి వెళ్లి తాను నడిపే ట్యాంకర్‌కు ప్లాంట్‌లో నీళ్లు నింపుకొని ముత్యాలమ్మ బజార్‌కు బయలు దేరాడు. ఆ బజార్‌లోని ఓ ఇంట్లో ట్యాంక్‌ను కరెంట్ మోటార్ ద్వారా నింపే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై మృతుని భార్య రాసమళ్ల సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
నీటి గుంతలో పడి వృద్ధుడు మృతి


