స్వర్ణగిరీశుడికి అష్టదళ పాదపద్మార్చన
భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో స్వామి వారికి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారికి ఆలయ అర్చకులు సుప్రభాత సేవ, సహస్రనామార్చన సేవ, కార్తీక దామోదర హవనం, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, పద్మావతి గోదాదేవి సమేత శ్రీవారి నిత్య కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
పంచముఖ పరమేశ్వరుడికి నిజాభిషేకం
భువనగిరి మండలంలోని వడాయిగూడెం పరిధిలోని సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర దేవస్థానంలో కార్తీక మాస బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీపంచముఖ పరమేశ్వర మూలమూర్తికి పంచామృత నిజాభిషేకం, బిల్వార్చన, మంగళహారతి మంత్ర పుష్పం, రుద్రహోమం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 60 అడుగుల పంచముఖ హనుమదీశ్వర సంయుక్త మహామూర్తులపాదాలకు అష్టోత్తర శత కలశములతో క్షీరాభిషేకం, మహామూర్ణహుతి, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, కుంభసంప్రోక్షణ, సాయంత్రం కార్తీక దీపోత్సవం, అకాశ దీపారాధన నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


