దంచికొట్టిన వాన
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
- 9లో
15న ప్రత్యేక లోక్‌అదాలత్
రామన్నపేట : పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు రామన్నపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌కోర్టు జడ్జి ఎస్.శిరీష తెలిపారు. లోక్ అదాలత్ నిర్వహణ, విజయవంతం కోసం మంగళవారం కోర్టు ఆవరణలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసులు, న్యాయవాదులు లోక్ అదాలత్‌ల ఉద్దేశ్యాన్ని కక్షిదారులకు తెలియజేసి చట్ట పరిధిలో ఎక్కువ కేసులు పరిష్కరించే విధంగా చొరవ చూపాలని సూచించారు. కక్షిదారులు లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు డి.నాగరాజు, యుగంధర్ పాల్గొన్నారు.


