నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యం
భువనగిరి: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడమే లక్ష్యంమని ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుధీర్‌కుమార్ అన్నారు. సోమవారం విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా భువనగిరిలోని విద్యుత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.విద్యుత్‌కు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్న ఫిర్యాదు చేయాలన్నారు. మెరుగైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అంతకుముందు వినయోగదారులు వివిధ విద్యుత్ సమస్యలపై విన్నవించారు. మోత్కూర్, ఆలేరులో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన వారికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అకౌంట్ ఆఫీసర్ హరీష్‌కుమార్, డీఈ వెంకటేశ్వర్లు, ఏడీఈ ఆనంద్‌రెడ్డి, ఏఈ సాయికృష్ణ, అధికారులు భాస్కర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఫ ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుధీర్‌కుమార్


