ఎకరానికి రూ.30వేలు చెల్లించాలి
భువనగిరి, ఆత్మకూర్ (ఎం) : వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30వేలు చెల్లించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మోంథా తుపాన్ కారణంగా రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందన్నారు. సోమవారం ఆయన భువనగిరి మండలం తుక్కాపురం, ఆత్మకూర్(ఎం)లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఏప్రిల్, మే నెలలో వచ్చిన అకాల వర్షాలకు 55 వేల ఎకరాల్లో, ఆగస్టు, సెప్టెంబర్‌లో వచ్చిన వర్షాలకు 2.50 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయని, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున ఇస్తామని అప్పట్లో ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు రైతుల ఖాతాలో డబ్బు వేయలేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పరిహారం ఇస్తామని ప్రకటన చేయడంతప్ప ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రైతుల సమస్యలను పక్కన పెట్టి ముంబాయికి పెళ్లిళ్లకు వెళ్లి హీరోలను కలుసుకోవడం తప్ప సీఎం చేస్తుంది ఏమీ లేదన్నారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా బస్తాకు 4కిలోల చొప్పున తరుగు కింద తీస్తున్న ధాన్యం ఎక్కడికి పోతుందని ప్రశ్నంచారు.ఽ రైతులకు ఇస్తానని చెప్పిన రూ.500 బోనస్ ఇవ్వకపోగా, రైతు భరోసా ఒక విడత పెండింగ్‌లోనే ఉందన్నారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. మహేశ్వర్‌రెడ్డి వెంట కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం నర్సయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు చందా మహేందర్ గుప్తా, తడిసిన మల్లారెడ్డి, ఆత్మకూర్(ఎం) మండల అధ్యక్షుడు గజరాజు కాశీనాఽథ్, నాయకులు బొట్టు అబ్బయ్య, తుమ్మల మురళీధర్‌రెడ్డి, బొబ్బల ఇంద్రారెడ్డి, బండారు సత్యనారాయణ, శ్యాంసుందర్‌రెడ్డి, పట్నం శ్రీనివాస్, ఫక్కీర్ రాజేందర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, వినోద్‌కుమార్, మాణిక్యంరెడ్డి, అంజనేయులు, అనిల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి


