కాపుగల్లులో ఆరు మేక పిల్లలు మృతి
కోదాడ రూరల్ : కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో వీధి కుక్కలు దాడి చేయడంతో ఆరు మేక పిల్లలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన మేకల కాపరి పిట్టల పుల్లయ్య సోమవారం రాత్రి తన మేక పిల్లలను దొడ్డిలో కట్టేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం దొడ్డి వద్దకు వచ్చి చూడగా కుక్కల దాడి చేయడంతో ఆరు మేక పిల్లలు మృతి చెంది ఉన్నాయి. తనను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాడు.
కుక్కల దాడిలో
పలువురికి గాయాలు
నల్లగొండ టూటౌన్: నల్లగొండ పట్టణంలోని కేశరాజుపల్లిలో మంగళవారం ఉదయం కుక్కలు దాడి చేయడంతో సుమారు పది మంది గాయపడ్డారు. జ్యోతి, పద్మ, శివరాంకు తీవ్రగాయాలు కావడంతో నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో కుక్కలు అధికంగా ఉన్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలను గ్రామం నుంచి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


