ఆడపిల్ల భారమవుతోందని..
సుమోటోగా స్వీకరణ
స్పెషల్ డ్రైవ్ చేపడుతాం
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : వారసుడు కావాలనే కోరిక వారితో ఏదైనా చేయిస్తుంది. ఎంతవరకై నా తీసుకెళ్తోంది. ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా రెండు కాదు, మూడు కాదు ఏకంగా నాలుగు, ఐదు సార్లు గర్భం దాల్చుతున్నారు. ఆ కాన్పుల్లోనూ ఆడపిల్ల పుడితే సాకలేమనే కారణంతో కన్న పేగు బంధాన్ని మరచి విక్రయించడమో, శిశుగృహకు తరలించడమో చేస్తున్నారు. చివరికి బ్రూణహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో తిరుమలగిరి(సాగర్) మండలంలో చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. శిశువిక్రయాలపై అధికారులు పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికి గిరిజనుల్లో ఏలాంటి మార్పు రావడం లేదనడాని చెప్పడానికి సోమవారం మండలంలో వెలుగులోకి వచ్చిన శిశు విక్రయం సంఘటనే ఉదాహరణగా చెప్పవచ్చు.
అవగాహన మూణ్నాళ్ల ముచ్చటే
శిశువిక్రయాలపై తండాల్లో అధికారులు గిరిజనులకు ప్రభుత్వ పథకాల మీద అవగాహన కల్పిస్తున్నా అది ముణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతోంది. గతకొన్ని నెలల క్రితమే మండలానికి చెందిన ఓ గిరిజన దంపతులు పుట్టిన బిడ్డను ఆస్పత్రిలో విక్రయించిన సంఘటన మరువకముందే సోమవారం మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. మచ్చుకు ఒకటి రెండు సంఘటలు వెలుగులోకి వస్తున్నా తండాల్లో, గ్రామాల్లో ఆడపిల్లల విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయనే ఆరోపలు వినిపిస్తున్నాయి. గిరిజనులకు ఆడపిల్లలు భారం కాకుడదనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం గిరిపుత్రిక పేరుతో గిరిజన బాలికలకు రూ. లక్ష డిపాజిట్ చేస్తుంది. అలాగే బాలికల సంక్షేమానికి సుఖన్యయోజన అమలు చేస్తోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గురుకుల, రెసిడెన్షియల్, కస్తూర్భాగాంధీ విద్యాలయాలతో పాటు సన్నబియ్యంతో నాన్యమైన భోజనం, కళ్యాణలక్ష్మీ పథకం, షీ టీమ్స్‌తో ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తున్నా గిరిజనుల్లో మార్పురాకపోవడం గమనార్హం.
శిశు విక్రయాలకు పాల్పడే వారిపై జూనల్ జస్టిస్(జేజే) యాక్టు ద్వారా కేసు నమోదు చేస్తాం. శిశువిక్రయాలు, బ్రూణహత్యలు జరుగకుండా పోలీస్‌శాఖ నిఘా ఏర్పాటు చేసింది. గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే సమాచారమివ్వాలి. అదేవిధంగా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.
– వీరశేఖర్, ఎస్‌ఐ
ఫ ఆడ శిశువులను విక్రయిస్తున్న
కొందరు దంపతులు
ఫ భ్రూణహత్యలకు సైతం వెనకాడని వైనం
ఫ గ్రామాల్లో అవగాహన
కార్యక్రమాలు నిర్వహిస్తున్నా
కనిపించని మార్పు
తిరుమలగిరి(నాగార్జునసాగర్): శిశు విక్రయం కేసును తెలంగాణ లోకాయుక్త సుమోటాగా స్వీకరించింది. సాక్షి ప్రధాన సంచికలో మంగళవారం చెల్లిని ఇవ్వొద్దు.. శీర్షికన శిశువును అమ్మేసిన గిరిజన దంపతులు అనే కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త సుమోటాగా స్వీకరించి సీ్త్ర,శిశు సంక్షేమ, వికలాంగ, వయోవృద్ధుల జిల్లా సంక్షేమ అధికారి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ఉమెన్ డెవలప్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ నల్లగొండ జిల్లా అఽధికారులకు జరిగిన సంఘటనపై పూర్తిస్థాయిలో సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు.
మంత్రి సీతక్క ఆరా..
శిశు విక్రయం ఘటనపై మంత్రి సీతక్క ఆరా తీశారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. శిశువును వెంటనే సంరక్షణలోకి తీసుకోవాలని సూచించారు. దీంతో నల్లగొండ నుంచి పోలీస్ బృందాలు వెళ్లి శిశువు సమాచారాన్ని తెలుసుకొని తమ సంరక్షణలోకి తీసుకున్నారు.
శిశువిక్రయాలపై అవగాహన కల్పించేందుకు శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. అంగన్‌వాడి సూపర్‌వైజర్లు, టీచర్లు మొదటి కాన్పులో ఆగబిడ్డకు జన్మనిచ్చి రెండు, మూడో సారి గర్భందాల్చిన గర్భిణుల వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తాం. ఓవైపు అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం.
– కృష్ణవేణి, డీడబ్ల్యూఓ, నల్లగొండ
ఆడపిల్ల భారమవుతోందని..
ఆడపిల్ల భారమవుతోందని..


