
అభివృది్ధకి దారి లేదా!
ఎమ్మెల్యే, మంత్రికి విన్నవించాం
డబుల్ రోడ్డుతోనే అభివృద్ధి
సరైన రవాణా వ్యవస్థ లేక మోటకొండూర్ మండలం అభివృద్ధి జరగడం లేదు. మండల కేంద్రానికి వెళ్లడానికి సౌకర్యాలు లేవు. ఆలేరు–కాటేపల్లి వరకు వయా మోటకొండూర్ మీదుగా ఉన్న బీటీ రోడ్డును డబుల్ రోడ్డుగా మారిస్తే ఎంతో మేలు జరుగుతుంది.
– పన్నాల చంద్రశేఖర్‌రెడ్డి,
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు
మోటకొండూర్: పునర్విభజనలో భాగంగా ఏర్పడిన మోట కొండూరు మండల అభివృద్ధికి తొమ్మిదేళ్లయినా బాటలు పడటం లేదు. మండల కేంద్రానికి సరైన రోడ్డు లేకపోవడంతో రవాణా సౌకర్యం మెరుగుపడటం లేదు. హ్యామ్‌లో భాగంగా జిల్లాలో 129.9 కిలో మీటర్ల మేర రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా అందులో మోటకొండూరు మండలానికి చోటు దక్కలేదు.
డబుల్ లేన్ వస్తే తగ్గనున్న దూరాభారం
వరంగల్–నల్లగొండ మార్గంలో నిత్యం వేలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆలేరు నుంచి వయా భువనగిరి మీదుగా వలిగొండ చేరుకోవటానికి 46 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఆలేరు నుంచి మోటకొండూర్ మీదుగా వలిగొండకు కేవలం 34 కిలో మీటర్ల దూరం వస్తుంది. కాటేపల్లి నుంచి మోటకొండూర్ మీదుగా ఆలేరు వరకు 15 కి.మీ దూరం ఉన్న బీటీ రోడ్డును డబుల్ లేన్‌గా మారిస్తే ఇటుగా వెళ్లే వాహనాలకు 12 కి.మీ దూరం తగ్గటంతో పాటు సమయం ఆదా అవుతుంది.
ఈ గ్రామాలకు ప్రయోజనం
ఆలేరు–కాటేపల్లి రోడ్డును డబుల్ లేనుగా చేయడం వల్ల ఆలేరు బైపాస్ నుంచి బహుదూర్‌పేట్, మంతపురి, దిలావర్‌పూర్, మోటకొండూర్, సికింద్రనగర్, కాటేపల్లి మార్గంలో పలు గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. మోటకొండూర్ నుంచి భువనగిరి డబుల్ రోడ్డు సదుపాయం కల్పిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. మోటకొండూర్ నుంచి చీమలకొండూర్ మీదుగా భువనగిరికి డబుల్ రోడ్డు పడుతుందని మండల వాసులు ఎదురుచూశారు. కానీ, ఇప్పటి వరకు అడుగుపడలేదు. మోటకొండూర్ మండల అభివృద్ధికి దోహదపడే రహదారులన్నింటినీ అప్‌గ్రేడ్ చేయాలని, పునర్వి భజన హామీలను అమలు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
విస్తరణకు నోచని ఆలేరు–కాటేపల్లి రహదారి
డబుల్ లేన్ చేస్తేనే మోటకొండూరు
అభివృద్ధి
వరంగల్–నల్లగొండ వెళ్లే వాహనాలకు తగ్గనున్న దూరం
ఆలేరు–కాటేపల్లి రోడ్డును రెండు వరుసలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐల య్య, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి విన్నవించాం. జీపీ రోడ్డుగా ఉన్నందున, ఆర్‌అండ్‌బీ రహదారిగా అప్‌గ్రేడ్ చేయాలని తెలిపారు. రోడ్డును ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేస్తుందన్న ఆశాభావంతో ఉన్నాం.
– పాండురంగయ్య గౌడ్,
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

అభివృది్ధకి దారి లేదా!

అభివృది్ధకి దారి లేదా!