
అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేయండి
భువనగిరిటౌన్ : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక అన్ని వర్గాల అభీష్టం మేరకే జరుగుతుందని, పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఏఐసీసీ పరిశీలకుడు శరత్‌రౌత్, టీపీసీసీ పరిశీలకుడు, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి పేర్కొఅన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన భువనగిరి నియోజకవర్గ స్థాయి సమావేశంలో కార్యకర్తలు, నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ చేయడంతో పాటు, ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో భద్రత కొరవడిందన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కాగా డీసీసీ అధ్యక్ష పదవికి తంగళ్లపల్లి రవికుమార్, బర్రె జహంగీర్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు నీలం పద్మ, నాయకులు పోత్నక్ ప్రమోద్‌కుమార్, తడక వెంకటేశం, పంజాల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఏఐసీసీ పరిశీలకుడు శరత్‌రౌత్