
కేటీఆర్‌ను కలిసిన గొంగిడి దంపతులు
యాదగిరిగుట్ట : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్‌ఎస్ రైతు విభాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. తమ కుమార్తె వివాహానికి హాజరుకావాలని ఆహ్వా నించారు.ఆలేరు నియోజకవర్గంలో రాజ కీయ పరిస్థితులపై గొంగిడి దంపతులతో కేటీఆర్ చర్చించారు. అనంతరం మాజీ మంత్రులు హరీష్‌రావు, కుందూరు జానారెడ్డిని కలిసి పెళ్లి పత్రిక అందజేశారు.
నకిలీ మందుల
సమాచారమివ్వండి
భువనగిరిటౌన్ : ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారిన నకిలీ డ్రగ్స్‌పై సమాచారం ఇవ్వాలని ఔషధ తనిఖీ జిల్లా అధికారి ఏలె బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.నకిలీ మందులు వ్యాధిని నయం చేయకపోవడమే కాకుండా ఆరోగ్యంపై దుష్ప్రరిణామాలు సృష్టిస్తాయన్నారు. మత్తు కలిగించే నార్కోటిక్ సంబంధిత ఔషధాల తయారీ, వినియోగం, ఇతర నిషేధిత మందుల అమ్మకాలు, నాణ్యత సమాచారాన్ని టోల్‌ఫ్రీ నంబర్ 18005996969 ద్వారా తెలియజేయాలని పేర్కొన్నారు. సమాచారమిచ్చిన వ్యక్తులు వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
యాదగిరి క్షేత్రంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు గా వించారు. రాత్రికి స్వామివారికి శయనో త్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.