
కూరెళ్లలో కోతుల బెడద ఉండదిక
పదేళ్ల సమస్యకు విముక్తి కలగనుంది
ఆత్మకూరు(ఎం): ఆ గ్రామంపై నిత్యం కోతులు దండయాత్ర చేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి కనపడ్డ వస్తువునల్లా ఛిద్రం చేస్తున్నాయి. ఆహారపదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి. పెంకుటిళ్లను పీకి పందిరేస్తున్నాయి. దారిన వెళ్లేవారిని గాయపరుస్తున్నాయి. ఇకనుంచి అటువంటి పరిస్థితి ఉండదు. ఆత్మకూరు(ఎం) మండలం కూరెళ్ల గ్రామ పంచాయతీలో సుమారు 2 వేల జనాభా ఉంది. గ్రామస్తులు పదేళ్లుగా కోతులతో ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను అధికా రుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. చివరకు గ్రామస్తులంతా మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ నంచి ప్రత్యేక టీంలను రప్పించారు. పట్టి తరలించినందుకు ఒక్కో వానరానికి రూ.300 చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. గ్రామంలో 500 ఇళ్లు ఉండగా.. ఇంటికి రూ.1000 చొప్పున ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
వానరాల పట్టివేతకు శ్రీకారం
కరీంనగర్ నుంచి వచ్చిన ప్రత్యేక టీంలు ఆదివారం పాఠశాల ఆవరణలో బోన్లు ఏర్పాటు చేశారు. మొదటి రోజు 20 వరకు వానరాలను బంధించారు. కోతులన్నింటినీ పట్టిన సురక్షితంగా అడవుల్లో వది లిపెట్టనున్నట్లు బృందం సభ్యులు తెలిపారు.
వానరాలను పట్టి తరలించేందుకు కరీంనగర్ నుంచి వచ్చిన టీంలు
ఒక కోతికి రూ.300 చొప్పున చెల్లింపు
ఇంటికి రూ.వెయ్యి చొప్పున ఇచ్చేందుకు ముందుకొచ్చిన గ్రామస్తులు
దాదాపు పదేళ్లుగా కోతులు గ్రామస్తులకు కంటిమీద కు నుకు లేకుండా చేస్తున్నాయి. కోతుల వల్ల జరి గిన నష్టం అంతాఇంతా కాదు. పలువు రు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. ఇంటికి వెయ్యి రూపాయల చొప్పున వేసుకొని కోతులను పట్టిస్తున్నాం. గ్రామస్తులంతా సహకరిస్తున్నారు. – బాషబోయిన ఉప్పలయ్య యాదవ్,
కూరెళ్ల మాజీ సర్పంచ్

కూరెళ్లలో కోతుల బెడద ఉండదిక