
దీపావళి డెడ్‌లైన్..
మదర్ డెయిరీ
పరిరక్షణ కమిటీ ఏర్పాటు
మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: కాసం
ఆలేరు: పెండింగ్ పాల బిల్లుల సాధన ఐక్య ఉద్యమానికి పాడి రైతులు సిద్ధం అయ్యారు. పెండింగ్ పాలబిల్లుల చెల్లింపునకు మదర్ డెయిరీకి దీపావళి డెడ్‌లైన్ విధించారు. అప్పటికీ స్పందన రానిపక్షంలో ప్రభుత్వంతో పాటు మదర్ డెయిరీపై ఒత్తిడి పెంచేందుకు సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే, మంత్రుల ఇళ్లతో పాటు కలెక్టరేట్, సచివాలయం ముట్టడి కార్యక్రమాలను దశలవారీగా చేపట్టాలని నిర్ణయించారు. సోమవారం ఆలేరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రైతులు, అఖిలపక్ష నాయకులు, పాలసంఘాల చైర్మన్లు ము ట్టడించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు వినతిపత్రం అంటించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆలేరులోని పాలశీతలీకరణ కేంద్రంలో పాడి రైతులు, పాల సంఘాల చైర్మన్లు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.
హామీలను విస్మరించారు
మదర్ డెయిరీలో అవినీతి పెరిగిపోవడమే రైతులకు పాల బిల్లులు రూ.కోట్లలో పేరుకుపోయాయని రౌండ్ టేబల్ సమావేశంలో పాడి రైతులు, పాల సంఘాల చైర్మన్లు విమర్శించారు. ఉమ్మడి జిల్లా మంత్రులు, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మదర్ డెయిరీ ఎన్నికల సమయంలో పాల బిల్లలు పెండింగ్ లేకుండా చూస్తామని, అన్నివిధాలా సహకారం అందిస్తామని ఇచ్చిన హామీని విస్మరించారని మండిపడ్డారు. ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం ప్రకటించిన రూ.5 ఇన్సెంటివ్ కూడా చెల్లించలేదన్నారు. రైతుల సమస్యల పరిష్కరించడమంలో విఫలమైన మదర్‌డెయిరీ చైర్మన్ పదవికి మధుసూదన్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేయాలన్నారు. విజయడెయిరీని ప్రోత్సహించాలనే ఆలోచనతో మదర్‌డెయిరీని నిర్వీ ర్యం చేసే కుట్రలు జరుగుతున్నట్టు రైతులు ఆరోపించారు. మదర్‌డెయిరీని విక్రయించాలనే ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు.మదర్ డెయిరీ మాజీ చైర్మన్ శ్రీకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని 12మంది ఎమ్మెల్యేలు పాడి రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని గ్రాంట్ అడగాలన్నారు. నష్టాలతో సంస్థ మూసివేసే పరిస్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా పాడి రైతులు సంఘటితంగా పోరాటం చేయాలని, ఇందులో కాంగ్రెస్ కూడా పాల్గొనవచ్చన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మదర్‌డెయిరీ డైరెక్టర్ భాస్కర్‌గౌడ్, ఆలేరు,యాదగిరిగుట్ట పీఏసీఎస్ చైర్మన్లు మల్లేష్‌గౌడ్,రామ్‌రెడ్డి, మాజీ డైరెక్టర్ దొంతిరి సోమిరెడ్డి, అఖిలపక్ష నాయకులు మంగ నర్సింహులు,పుట్ట మల్లేష్,గంగుల శ్రీనివాస్‌యాదవ్,ఆర్.జనార్థన్,నందగంగేష్, తునికి దశరథ,చెక్క వెంకటయ్య,మామిడాల సోమయ్య,జంగస్వామి, లక్ష్మీప్రసాద్‌రెడ్డి, సూదగాని సత్యరాజయ్య,చాడ సురేందర్‌రెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, పాల సంఘాల చైర్మన్‌లు, పాడి రైతులు పాల్గొన్నారు.
ఫ కన్వీనర్‌గా కొండల్‌రెడ్డి
మదర్ డెయిరీ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కన్వీనర్‌గా బొళ్ల కొండల్‌రెడ్డి, కో–కన్వీనర్లుగా లింగాల శ్రీకర్‌రెడ్డి, రంగారెడ్డి, సందిల్ల భాస్కర్, దొంతిరి సోమిరెడ్డి, చింతపురి వెంకట్‌రామిరెడ్డి, కస్తూరి పాండు, ఒగ్గు బిక్షపతి, మంగనర్సింహులు, కళ్లెపు అడవయ్య, చెక్క వెంకటేష్, గంగుల శ్రీనివాస్, రాంగోపాల్‌రెడ్డి, కాదూరి అచ్చయ్య, గడ్డం నాగరాజు, మటూరి బాల్‌రాజు, బబ్బూరి పోశెట్టి,కొల్లూరి రాజయ్య, ఇమ్మడి రామిరెడ్డి, కామిటికారి కృష్ణ ఎన్నియ్యారు.
పాలబిల్లుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణ
ఫ ఐక్య ఉద్యమానికి పాడి రైతులు సిద్ధం
ఫ దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు
మదర్‌డెయిరీ పరిక్షణతోపాటు పాడి రైతులను ఆదుకునేందుకు మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా కేంద్రం దృష్టికి తీసుకువెళతానని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేరుకే ఉన్నత హోదాలో ఉన్నారని, పాడి రైతులకు ఏం చేయలేనప్పుడు రైతుల గురించి మాట్లాడే హక్కు వారికి లేదన్నారు.

దీపావళి డెడ్‌లైన్..

దీపావళి డెడ్‌లైన్..