
దత్తన్నా.. సమస్య తీర్చన్నా
ఎయిమ్స్ వైద్య కళాశాల సందర్శనకు వచ్చిన హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయను చూసిన ఓ గర్భిణి ఆయన వద్దకు వచ్చి ఆస్పత్రిలోని సమస్యలు చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. క్యూలైన్లలో వేచి వుండలేక అవస్థలు పడుతున్నాం, మా సమస్య తీరేలా చొరవ చూపండి అంటూ మొరపెట్టుకుంది. అందరితో పాటు గర్భిణులు కూడా లైన్లలో గంటల తరబడి వేచి వుండాల్సి వస్తుంది, రోజులు తరబడి రిపోర్టుల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని వాపోయింది. గర్భిణుల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయించి సమస్యను తీర్చాలని వేడుకుంది. అక్కడే ఉన్న డిప్యూటీ డైరెక్టర్ బిపిన్ వర్గీస్, మెడికల్ సూపరింటెండెంట్ మహేశ్వర్‌రెడ్డికి దతాత్రేతయ సూచించగా గర్భి ణుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.