
పాముకుంట సీఎస్‌పీ తొలగింపు
రాజాపేట : మండలంలోని పాముకుంట గ్రామానికి చెందిన సీఎస్‌పీ(కస్టమర్ సర్వీస్ పాయింట్) నిర్వాహకుడు భద్రారెడ్డిని బాధ్యతల నుండి తొలగిస్తున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ నాగలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరో గ్రామానికి చెందిన సీఎస్‌పీ విధులు నిర్వహిస్తాడని పేర్కొన్నారు. ఇక ముందు తెలంగాణ గ్రామీణ బ్యాంకు నిర్వహించే లావాదేవీలతో భద్రారెడ్డికి సంబంధం ఉండదని, ఖాతాదారులు గమనించాలని కోరారు.
508 దరఖాస్తులు
భువనగిరి: మద్యం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం వరకు మొత్తం 508 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. దరఖాస్తు గడువు ఈనెల 18తో ముగియనుందన్నారు. కాగా మద్యం టెండర్లు పిలిచి 18 రోజులు గడుస్తున్నా ఆశించినస్థాయిలో దరఖాస్తులు రావడం లేదు. టెండర్ ఫీజు రూ.3 లక్షలకు పెంచడం కారణంగా చెప్పుకుంటున్నారు.
శివాలయంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు నిర్వహించారు. రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖ మండపంలోని స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్ర ధానాలయంలో నిత్యారాధనలు కొనసాగాయి. వేవకుజామున సుప్రభాతసేవ, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, అర్చన చేశారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన, నిత్యకల్యాణం,జోడు సేవోత్సవం పూజలు నిర్వహించారు.
15 నుంచి గాలికుంటు నివారణ టీకాల పంపిణీ
భువనగిరిటౌన్ : పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు ఈనెల 15నుంచి నవంబర్ 14వ తేదీ వరకు క్యాంప్‌లు నిర్వహించి టీకాలు వేయనున్నట్లు జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ జానయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 47 బృందాలు క్యాంపుల్లో పాల్గొంటాయన్నారు. ఈ శిబిరాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గాంధీ విగ్రహాల సేకరణ
చండూరు : గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వర్ణోత్సవాల్లో భాగంగా గాంధీజీ లక్ష విగ్రహాల సేకరణ కార్యక్రమాన్ని చండూరులోని గాంధీజీ విద్యాసంస్థల నుంచి ప్రారంభిస్తున్నట్లు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థ వైస్ చైర్మన్ యానాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం పాఠశాలలో లక్ష విగ్రహాల సేకరణ కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం దక్కేలా ఈ లక్ష విగ్రహాల సేకరణ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్మా నల్ల గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు 10 విగ్రహాలకు గాను రూ.15వేల విరాళంప్రభాకర్‌రెడ్డికి అందజేశారు.