
గంజాయి, డ్రగ్స్ కట్టడికి చర్యలు
ధాన్యం పక్వానికి రాకముందే
వరి కోతలు చేపట్టవద్దు
సాక్షి,యాదాద్రి: గంజాయి, డ్రగ్స్ కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్, ఎకై ్సజ్, డ్రగ్స్ ఇన్స్‌పెక్టర్, వైద్య, విద్య, అటవీ, ఆర్టీసీ అధికారులు సమన్వయం చేసుకొని గంజాయిరహిత జిల్లాగా మార్చాలని కోరారు. చెక్‌పోస్ట్‌ల్లో నిఘా పెంచాలని, గంజాయి సాగును గుర్తించాలని సూచించారు. యువత, విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాటివల్ల కలిగే అనర్థాలపై ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని సూచించారు. ము ఖ్యంగా కళాశాలల వద్ద ఎక్కువ ఫోకస్ పెట్టాలని పేర్కొన్నారు. పోలీస్, ఎక్సైజ్ అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహిస్తుండాలని స్పష్టం చేశారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలని, చెడు అలవాట్లకు లోనవకుండా గమనిస్తుండాలన్నారు. డీసీపీ అక్షాంశ్‌యాదవ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ నియంత్రణలో పోలీస్ శాఖ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ల వద్ద పటిష్ట నిఘా ఉంచామని తెలిపారు. సెప్టెంబర్‌లో రెండు గంజాయి కేసులను గుర్తించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, ఎకై ్స జ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి, డీఎఫ్‌ఓ పద్మజ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరిటౌన్ : ధాన్యం పక్వానికి రాకముందే వరి కోతలు చేపట్టవద్దని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరికోత యంత్రాల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ అధికారులు సూచన మేరకు వరి కోతలు చేపట్టాన్నారు. హార్వెస్టర్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. వ్యవసాయ అధికారుల పనితీరు బాగుందని, రాష్ట్రంలో అంతటా యూరియా కొరత ఉన్నా మన జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో పని చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, అదనపు డీసీపీ లక్ష్మీనారా యణ, ఏసీపీలు మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాసనాయుడు, ప్రభాకర్‌రెడ్డి, డీఆర్‌ఓ జయమ్మ, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, సివిల్ సప్లై అధికారి రోజారాణి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు