
జాతీయ స్థాయికి ఎదిగేలా సాధన చేయాలి
చౌటుప్పల్ : మల్లకంబ్‌లో రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులు జాతీయ స్థాయికి ఎదిగేలా సాధన చేయాలని ఎస్‌జీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి దశరథరెడ్డి, పీఈటీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపారు. మల్లకంబ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక కోసం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శుక్రవారం ట్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో సెలక్షన్స్ నిర్వహించారు. అండర్–14, అండర్–17, అండర్–19విభాగాల కోసం నిర్వహించిన పోటీల్లో ఒక్కో విభాగం నుంచి 12మంది బాలురు, 12మంది బాలికలను ఎంపిక చేశారు. వీరు నవంబర్‌లో చౌటుప్పల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో దశరథరెడ్డి, కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఎంపికై న విద్యార్థులు తమ జిల్లాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఎంపిక పోటీలు నిర్వహించిన ట్రినిటీ విద్యాసంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ కేవీబీ.కృష్ణారావు, డైరెక్టర్ డాక్టర్ ఉజ్జిని మంజుల పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఈఓ గురువారావు, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, వ్యాయామ శిక్షకులు శోభ, బిక్కునాయక్, గోపాల్, కిరణ్, వెంకటేష్, నరేష్, మంజుల పాల్గొన్నారు.
ఫ ఎస్‌జీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి దశరథరెడ్డి