
స్వర్ణగిరీశుడికి తిరువీధి సేవ
భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో శుక్రవారం రాత్రి శ్రీవేంకటేశ్వరస్వామి వారి తిరువీధి సేవ కనులు పండువగా సాగింది. స్వామివారిని సుందరంగా అలంకరించి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అంతకుముందు వేకువజామున సుప్రభాత సేవ, తో మాల సేవ, సహస్రనామార్చన, నిత్యకల్యా ణం నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.