
మద్యం టెండర్లకు 227 దరఖాస్తులు
భువనగిరి: జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. నాలుగు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలోని 82 దుకాణాలకు గాను గత నెల 26నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొత్తం 227 దరఖాస్తులు రాగా.. అందులో శుక్రవారం ఒక్క రోజే 36 దరఖాస్తులు ఉన్నట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. చివరి గడువు ఈనెల 18వ తేదీ వరకు ఉందన్నారు. నేడు రెండవ శనివారం (సెలవు) అయినప్పటికీ వ్యాపారుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. కాగా 27 మద్యం దుకాణాలకు ఒక దరఖాస్తు కూడా రాలేదు.
13న ప్రజావాణి
భువనగిరి టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో సోమవారం కలెక్టర్‌లో ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలంతా గమనించాలని, సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు రావచ్చన్నారు.
ఆండాళ్‌దేవికి ఊంజల్ సేవ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం నిత్యారాధనల్లో భాగంగా ఆండాళ్‌దేవికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా చేపట్టారు. సాయంత్రం వేళ అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అమ్మవారి సేవకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఆగమశాస్త్రానుసారం ఊంజల్ సేవ నిర్వహించారు.
విద్యార్థి దశలోనే కంప్యూటర్ పరిజ్ఞానం పొందాలి
వలిగొండ : విద్యార్థులు ప్రాథమిక దశలోనే కంప్యూటర్ పరిజ్ఞానంపై పట్టు సాధించాలని డీఈఓ సత్యనారాయణ సూచించారు. వలిగొండ మండలం లోతుకుంట గ్రామ ఆదర్శ పాఠశాలలో శుక్రవారం ‘ఏ బుక్ హన్ డిజిటల్ లెర్నింగ్’ అంశంపై జిల్లాస్థాయిలో గణిత ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు కంప్యూటర్ విద్యపై ఆసక్తి కనపరిచేలా వారిని తీర్చిదిద్దాలని సూచించారు. కోడింగ్ విధానంపై పట్టు సాధిస్తే భవిష్యత్‌లో ఉన్నత స్థితికి చేరుకునేందుకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల ప్రిన్సిపాళ్లు, డీఆర్పీలు పాల్గొన్నారు.
వాలీబాల్ పోటీలకు గురుకుల విద్యార్థి
ఆలేరు: రాష్ట్రస్థాయి వాలీ బాల్ పోటీలకు ఆలేరు వి ద్యార్థి బీ.మణికాంత్ ఎంపికయ్యాడు. మణికాంత్ ఆలేరులోని మహాత్మ జ్యోతి బాపూలే గురుకుల పాఠశాల, కళాశాల(రాజాపేట) లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 9న భువనగిరిలో జరిగిన అండర్–19 కేటగిరీలో జరిగిన ఎస్‌జీఎఫ్ సెలక్షన్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లా తరఫున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. దీంతో నవంబర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్టు పీడీ భాస్కర్ శుక్రవారం తెలిపారు.
వన్ హెల్త్ పై వర్క్‌షాప్
బీబీనగర్: మండల కేంద్రంలోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో వన్ హెల్త్(ఒక ఆరోగ్యం) అనే అంశంపై శుక్రవారం వర్క్‌షాపును నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ, జంతు పర్యావరణ ఆరోగ్యం మధ్య ఉండే పరస్పర సంబంధంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రాహుల్ నారంగ్, మౌనికరెడ్డి, దీపక్‌రాహుల్, జోత్న్స, విశాఖజైన్, రుద్రేష్, లక్ష్మీజ్యోతి, శ్యామల పాల్గొన్నారు.

మద్యం టెండర్లకు 227 దరఖాస్తులు

మద్యం టెండర్లకు 227 దరఖాస్తులు

మద్యం టెండర్లకు 227 దరఖాస్తులు