
వరద పారదు.. నీరు చేరదు
చౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణంలోని ఊరచెరువులో చుక్క నీరు లేక వెలవెలబోతోంది. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురువడంతో మండలంలోని దాదాపు చెరువులు, కుంటులు జలకళను సంతరించుకున్నాయి. కానీ, ఊర చెరువు మాత్రం నీటికి నోచుకోలేదు. చెరువులో సమృద్ధిగా నీరుంటే దిగువ భాగంలో భూగర్భ జలా లు సమృద్ధిగా ఉంటాయి. ఒక్కసారి చెరువు నిండితే వరుసగా రెండేళ్లపాటు నీటి సమస్య తలెత్తదు. మూ డేళ్ల నుంచి చెరువులోకి నీరు చేరకపోవడంతో దిగువ భాగంలో బోర్లు ఎండిపోయి తాగునీటికి కరువు ఏర్పడింది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే పరిస్థితులు తలెత్తాయి.
ఆనవాళ్లు కోల్పోయిన చెరువు
వరుసగా మూడేళ్లుగా చెరువులోకి నీరు చేరకపోవడంతో ప్రస్తుతం కంపచెట్లతో మూసుకుపోయింది. ఆనవాళ్లు కోల్పోయి దర్శనమిస్తోంది. చెరువులో రెండు ప్రాంతాల్లో ఉన్న గుంతల్లోకి మాత్రమే కొద్దిపాటి నీరు చేరింది. ఆ నీరు సైతం మరో రెండు వారాల్లో ఇంకిపోయే అవకాశం ఉంది.
పిలాయిపల్లి కాలువ ద్వారా
మూసీ జలాల మళ్లింపే శరణ్యం
ఊరచెరువు నీటితో కళకళలాడాలంటే వర్షం నీటితో సాధ్యమయ్యే పరిస్థితులు ఏ మాత్రం కనిపించడంలేదు. అందుకు పిలాయిపల్లి కాలువ ద్వారా మూసీ జలాలను చెరువులోకి మళ్లించడమే శాశ్వత పరిష్కారమని పట్టణవాసులు అంటున్నారు. కొద్దిపాటి నిధులు ఖర్చుచేస్తే మంచి ఫలితాలు దక్కనున్నాయని అభిప్రాయపడుతున్నారు.
చౌటుప్పల్ ఊరచెరువు మూడేళ్లుగా వెలవెల
ఫ సమృద్ధిగా వర్షాలు కురిసినా నీటికి కరువే
ఫ మూసీ జలాలను మళ్లించాలంటున్న పట్టణవాసులు

వరద పారదు.. నీరు చేరదు