మదర్‌ డెయిరీకి మరిన్ని కష్టాలు | - | Sakshi
Sakshi News home page

మదర్‌ డెయిరీకి మరిన్ని కష్టాలు

Oct 7 2025 3:19 AM | Updated on Oct 7 2025 3:19 AM

మదర్‌ డెయిరీకి మరిన్ని కష్టాలు

మదర్‌ డెయిరీకి మరిన్ని కష్టాలు

ప్రభుత్వ ఆదేశాలతోనే..

యాదగిరిగుట్ట: ఉమ్మడి నల్లగొండ–రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్‌(నార్ముల్‌)కు ఇప్పటికే ఉన్న కష్టాలకు మరిన్ని ఇబ్బందులు తోడయ్యాయి. మదర్‌ డెయిరీకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న యాదగిరిగుట్ట దేవస్థానానికి నెయ్యి సరఫరా నిలిచిపోవడంతో సంస్థకు మరింత నష్టం వాటిల్లనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయ డెయిరీతో యాదగిరి దేవస్థానం అధికారులు ఒప్పందం కుదుర్చుకొని, గత నెల 22వ తేదీ నుంచి నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు.

పెద్ద మొత్తంలో కోల్పోనున్న ఆదాయం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు, రాష్ట్రంలోని కీసర, వేములవాడ వంటి ఆలయాలకు గత కొన్నేళ్లుగా మదర్‌ డెయిరీ సంస్థ నెయ్యిని సరఫరా చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో గతేడాది నుంచి చెర్వుగట్టు, కీసర, వేములవాడ ఆలయాలకు మదర్‌ డెయిరీ నెయ్యిని నిలిపివేసి, విజయ డెయిరీ నెయ్యి వాడుతుండటంతో సంస్థ కొంత మేర ఆదాయం కోల్పోయింది. ఇప్పుడు తెలంగాణలోనే పెద్ద పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సైతం మదర్‌ డెయిరీ నెయ్యిని నిలిపివేశారు. డెయిరీ నుంచి ఒక యాదగిరిగుట్ట క్షేత్రానికే ప్రతినెలా 30 టన్నుల నెయ్యి సరఫరా అయ్యేది. దీని ద్వారా ఏటా రూ.18 కోట్ల వరకు దేవస్థానం చెల్లిస్తుంది. ఇప్పుడు పెద్ద మొత్తంలో చెల్లింపులు నిలిచిపోనున్నాయి. ఇది సంస్థకు పెద్ద దెబ్బ అని పాడి రైతులు అంటున్నారు. చివరిసారిగా సెప్టెంబర్‌ 18వ తేదీన 46 క్యాన్ల నెయ్యి (ఒక్కో క్యాన్‌లో 35 కిలోలు) మదర్‌ డెయిరీ సరఫరా చేసింది. ఇందుకు గాను ఆలయం రూ.24.93 లక్షల బిల్లు చెల్లించి నార్మూల్‌తో ఒప్పందం రద్దు చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో నార్మూల్‌తో నారసింహుడికి క్షేత్రానికి 35 ఏళ్లుగా ఉన్న అనుబంధం తెగిపోయింది.

యాదగిరి క్షేత్రానికి కొనసాగించాలని డిమాండ్‌

మదర్‌ డెయిరీ పరిధిలో 24 పాల శీతలీకరణ కేంద్రాలు ఉండగా.. 435 పాల సోసైటీల్లో 32వేల మంది వరకు సభ్యులు ఉన్నారు. సంస్థ ద్వారా ప్రతి రోజూ సుమారుగా 65వేల నుంచి 60వేలకు పైగా లీటర్ల పాల విక్రయాలు జరుగుతాయి. పాలతో పాటు అనుబంధం ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తుంది. ఇందులో ప్రధానంగా నెయ్యిని యాదగిరి క్షేత్రంతో పాటు వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుంది. కాగా ఆలయానికి మదర్‌ డెయిరీ సంస్థ నెయ్యినే కొనసాగించాలని సంస్థ అనుబంధ పాడి రైతులు, పాల సొసైటీ చైర్మన్లు, బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల యాదగిరిగుట్టలో దీక్ష కూడా చేశారు.

యాదగిరి క్షేత్రానికి నార్మూల్‌ నెయ్యి బంద్‌

ఫ గత నెల 23వ తేదీ నుంచి

విజయ డెయిరీ నుంచి సరఫరా

ఫ ఏటా రూ.18 కోట్ల ఆదాయం కోల్పోనున్న సంస్థ

ఫ ఇప్పటికే భారీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దుస్థితి

విజయ డెయిరీ నుంచి ఇప్పటికే రెండు ట్రిప్పుల నెయ్యి వచ్చింది. ఒక్కో ట్రిప్పులో 70 క్యాన్లు వచ్చాయి. క్కో క్యాన్‌లో 35 కిలోల వరకు నెయ్యి ఉంటుంది. మదర్‌ డెయిరీకి ఇ చ్చిన విధంగానే విజయ డెయిరీకి జీఎస్‌టీతో కలుపుకొని లీటర్‌ నెయ్యికి రూ.609 చెల్లిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలతోనే విజయ డెయిరీతో ఒప్పందం కుదుర్చుకొని, నెయ్యిని కొనుగోలు చేస్తున్నాం. –డి.నరేష్‌,

యాదగిరి ఆలయ గోదాం పర్యవేక్షకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement