
యాదగిరిగుట్టకు తరలివచ్చిన భక్తులు
యాదగిరిగుట్ట: దసరాకు సొంతూళ్లకు వెళ్లిన హైదరాబాద్ వాసులు తిరుగు ప్రయాణంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. దీంతో శనివారం ఆలయ పరిసరాలు, క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, మాడ వీధులు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పట్టగా.. వీఐపీ దర్శనానికి 45 నిమిషాల సమయం పట్టింది. స్వామిని 35వేలకు పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. నిత్యాదాయం రూ.41,31,970 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.