
బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
సూర్యాపేటటౌన్ : ఎదురుగా వస్తున్న బైక్‌ను కారు ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన జనగామ– సూర్యాపేట రహదారిపై సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామ స్టేజీ సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీతారాంపురం కాలనీకి చెందిన సారగండ్ల నాగరాజు(32), అతడి స్నేహితుడు సంతోష్ మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలకు వెళ్లి బైక్‌పై తుంగతుర్తి నుంచి సూర్యాపేటకు వస్తుండగా.. సూర్యాపేట నుంచి అర్వపల్లి వైపు వెళ్తున్న కారు జనగామ– సూర్యాపేట రహదారిపై సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామ స్టేజీ సమీపంలో వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెనుక కూర్చున్న సారగండ్ల నాగరాజు రోడ్డపై ఎగిరిపడి అక్కడిక్కడే మృతిచెందగా.. బైక్ నడిపిస్తున్న సంతోష్‌కు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిక్షణాల్లోనే బత్తుల సైదులు అనే వ్యక్తి స్కూటీపై సూర్యాపేట వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో బైక్‌ను తగిలి కిందపడిపోగా.. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ప్రమాదంపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ బాలునాయక్ తెలిపారు.
ఫ మరో ఇద్దరికి గాయాలు