
వాహనాల తనిఖీలు
యాదగిరిగుట్ట: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో శనివా రం సాయంత్రం ఏసీపీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. ముందస్తుగానే నగదు తరలించే అవకాశం ఉండటంతో తనిఖీలు చేసినట్లు పట్టణ సీఐ భాస్కర్ తెలిపారు. అంతేకాకుండా యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చే భక్తులకు సౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలు చేసినట్లు చెప్పారు.
మద్యం టెండర్లకు 45 దరఖాస్తులు
భువనగిరి: మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలోని నాలుగు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో 82 మద్యం షాప్‌లకు సెప్టెంబర్ 26 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. శని వారం సాయంత్రం వరకు 45 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ నెల 18వరకు దరఖాస్తు గడువు ఉంది.
దుర్గాదేవి ముక్కుపుడక రూ.1.55 లక్షలు
సంస్థాన్ నారాయణపురం: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సంస్థాన్‌నారాయణపు రం మండలం చిమిర్యాలలో విజయదుర్గ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవికి అలంకరించిన ముక్కు పుడక, చీరలు, దండ రికార్డు స్థాయి ధర పలికాయి. శనివారం నిర్వహించిన వేలంలో ముక్కు పుడకను మొగుదాల నరేష్ రూ.1,55,001, లక్ష్మీ దండను మొగుదాల హరీష్ రూ.1,00,001 దక్కించుకున్నారు. ముక్కపుడక, లక్ష్మీ దండ, చీరల వేలం ద్వారా రూ.5,09 లక్షల ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యుడు సుర్వి దయాకర్, దండుగుల నగేష్, మొగుదాల స్వామి, దాసోజు వెంకటాచారి, సిద్ధప్ప, శ్రీను, కిషన్, గణేష్, లింగస్వామి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలరించిన నృత్య ప్రదర్శన
భువనగిరి : మండల పరిధిలోని రాయగిరి మినీ శిల్పారామంలో దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సృజన అకాడమీ బృందం కళాకారులు భరతనాట్యంతో అలరించారు. సందర్శకులు ప్రదర్శనలు తిలకించి, చెరువులో బోటు షికారు చేసి ఆహ్లాదంగా గడిపారు.
సేవలకు గుర్తింపుగా పురస్కారం
భువనగిరి: జిల్లా కేంద్రానికి చెందిన బుషపాక శివకుమార్‌కు శ్రీ అన్నపూర్ణ పురస్కార్–2025 అవార్డు అందుకున్నాడు. సేవా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ద్వారా కొంతకాలంగా సా మాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. సేవలకు గుర్తింపుగా అవార్డు లభించింది. శనివారం హైదరాబాద్‌లోని త్యాగరాజు గాన సభలో మహాశాస్త్ర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకున్నారు.

వాహనాల తనిఖీలు