
మున్సిపాలిటీలకు నిధులొచ్చాయ్..
భువనగిరి: నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్న మున్సిపాలిటీలకు ఊరట కలగనుంది. మౌలిక వసతుల కల్పనకు నగరాభివృద్ధి పేరిట రూ.90 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూర్, భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్ల చొప్పున మంజూరయ్యాయి. ఈ నిధులతో మౌలిక వసతులు మెరుగయ్యే అవకాశం ఉంది.
కొంతవరకు తీరనున్న సమస్యలు
నిధులు రాక, సరైన ఆదాయ వనరులు లేక మున్సిపాలిటీలపై ఆర్థికంగా భారం పడుతోంది.అవసరాలకు అనుగుణంగా మౌలిక సౌకర్యాలు సమకూర్చలేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్లకాలంగా సీసీ రోడ్లు, అంతర్గత రహదారులకు నోచని ప్రాంతాలు ఉన్నాయి. పూర్తిస్థాయిలో డ్రెయినేజీలు లేకపోవడం, ఉన్న చోట అస్తవ్యస్తంగా ఉండటంతో జనావాసాల మధ్య మురుగు నీరు ప్రవహిస్తోంది. నగరాభివృద్ధి పేరిట ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో కొంత మేరకు సమస్య తీరనుంది.
నగరాభివృద్ధి పేరిట రూ.90 కోట్లు మంజూరు
ఫ ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్లు
ఫ డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యం