
సమన్వయంతో పని చేయండి
సాక్షి, యాదాద్రి: నోడల్ అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్‌ఓ), సహాయ రిటర్నింగ్ ఆఫీసర్లు (ఏఆర్‌ఓ)సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియ ను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని.. ఎన్నికల విధులు, బాధ్యతలు, నియమావళిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. హ్యాండ్‌బుక్‌లోని ప్రతి అంశంపై పట్టు ఉండాలని, పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వహించాలన్నారు.
సందేహాలను నివృత్తి చేసుకోవాలి
ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలకు ఏచిన్న సందేహం ఉన్నా తక్షణమే నివృత్తి చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, జెడ్పీసీఈఓ శోభారాణి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు