
శ్రీనివాసాచారికి దసరా పురస్కారం
రామగిరి(నల్లగొండ): విజయదశమి పర్వదినం సందర్భంగా విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం అందించే దసరా పురస్కారం – 2025కు నల్లగొండకు చెందిన తెలుగు అధ్యాపకుడు ఇడికోజు శ్రీనివాసాచారి ఎంపికయ్యారు. అక్టోబర్ 5న హైదరాబాద్‌లో జరిగే దసరా పురస్కారాల ప్రదానోత్సవంలో ఈ అవార్డు అందుకోనున్నారు. ఇడికోజు శ్రీనివాసాచారి తెలుగు భాష, జానపద అధ్యయనం, సాహిత్య సమీక్ష, సాంస్కృతిక పరిరక్షణకు ఆయన చేసిన కృషికిగాను ఆయనకు అవార్డు అందజేయనున్నారు.