
స్వర్ణగిరి క్షేత్రంలో 3 నుంచి పవిత్రోత్సవాలు
భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ మానేపల్లి రామారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేదీన ఉత్సవారంభ స్నవనం, పేద శేషవాహన సేవ, 4న గజ వాహన సేవ, హనుమంతవాహన సేవ, 5న కల్పవృక్షవాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ, 6న చిన్న శేషవాహన సేవ, సర్వభూపాల వాహన సేవ, 7వ తేదీన అష్టోత్తర శత కళాభిషేకం, మహాకుంభ సంప్రోక్షణ,గరుడ వాహనసేవ ఉంటాయన్నారు. శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామాజజీయర్ స్వామి దివ్య మంగళశాసనాలతో ఉత్సవాలు జరుగుతాయన్నారు.
సాక్షి, యాదాద్రి : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకారం అందించాలని కలెక్టర్ హనుమంతరావు కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావుతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పక పాటించాలని కోరారు. పార్టీలకు సంబంధించిన వాల్‌రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఫొటోలను తొలగించాలన్నా రు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రతేకాదికారులను నియమించామని, పెయిడ్ ఆర్టికల్స్‌ను పర్యవేక్షించి సంబంధిత పార్టీ, అభ్యర్థి ఖాతాలో ఖర్చు జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఎయిమ్స్‌లో రక్తదాన శిబిరం
బీబీనగర్: స్వస్థ్‌నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ ఎయిమ్స్‌లో బుధవారం రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతం శాంతాసింగ్ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాల కాపాడడానికి రక్తం ఎంతో అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ ఆరు నెలలకోసారి రక్తదానం చేయాలన్నారు. శిబిరం ద్వారా 36 యూనిట్ల రక్తం సేకరించినట్లు తెలిపారు. రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు.
నృసింహుడికి ఆరాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నిత్యారాధనలో భాగంగా గజవాహనసేవ నేత్రపర్వంగా చేపట్టారు. బుధ వారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అ ర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, నిజాభిషేకం, తులసీదళ అర్చన జరిపించారు.

స్వర్ణగిరి క్షేత్రంలో 3 నుంచి పవిత్రోత్సవాలు

స్వర్ణగిరి క్షేత్రంలో 3 నుంచి పవిత్రోత్సవాలు