
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ హనుమంతరావు
సాక్షి యాదాద్రి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనల మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్, ప్రైవేట్ స్థలాల్లో పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, అడ్వర్టైజ్‌మెంట్స్ కటౌట్స్ తొలగించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, భాస్కర్ రావు, జెడ్పీ సీఈఓ శోభారాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, చౌటుప్పల్ భువనగిరి కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి హర్షవర్ధన్ రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓ పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల నియమావళి) అమలుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలుపై రాష్ట్ర ఎన్నికల అధికారి రాణికుముదిని సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఏసీపీ రాహుల్ రెడ్డి, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు పాల్గొన్నారు.