
యాదగిరి క్షేత్రంలో మూల నక్షత్ర వేడుకలు
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి ఆలయంలో మూల నక్షత్రం వేడుకలను అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరిగే మూల నక్షత్ర వేడుకల్లో భాగంగా సోమవారం శ్రీమహాలక్ష్మీ అమ్మవారి సన్నిధిలో కలశ స్థాపన పూర్వక విశేష ఆరాధనలు, సహస్రనామార్చన నిర్వహించారు.
మహా శివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. కొండపైన యాదగిరీశుడి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్థిని సమేతా రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో రుద్రాభిషేకం, బిల్వా అర్చన పూజలు విశేషంగా నిర్వహించారు. శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణ వేడుక, జోడు సేవ పూజలు నిర్వహించారు.
ఆయుధ పూజ
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఎస్‌పీఎఫ్ సిబ్బందికి సంబంధించిన ఆయుధాలకు ఆలయ అర్చకులు సోమవారం ఆయుధ పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌పీఎఫ్ కమాండెంట్ బాబురావు, ఆర్‌ఐ శేషగిరిరావు, ఆలయాధికారులు పాల్గొన్నారు.