
యాదగిరి క్షేత్రంలో కోలాహలం
యాదగిరిగుట్ట రూరల్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, సంప్రదాయ పర్వాలు, భక్తజన సందోహంతో యాదగిరి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. ఆదివారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలు అర్పించి సహస్రనామార్చనతో కొలిచారు. ఆ తరువాత ప్రథమ ప్రాకార మండపంలో శ్రీ సుదర్శన నారసింహా హోమం, గజవాహనసేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖమండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్తోత్తర పూ జలు గావించారు. సాయంత్రం స్వామి వారికి వెండిజోడు సేవోత్సవం నిర్వహించి భక్తుల మధ్య ఊరేగించారు. వివిధ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
భళా.. నృత్యకళ
భువనగిరి : భువనగిరి పరిధిలోని రాయగిరి మినీ శిల్పారామంలో అదివారం తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కళా ప్రదర్శనలు అలరించాయి. సృష్టి డ్యాన్స్ అకాడమీ కళాకారులు కూచిపూడి నృత్యంతో ఆకట్టుకున్నారు. అదే విధంగా యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లిన భక్తులు తిరుగుపయనంలో శిల్పారామాన్ని సందర్శించారు. కళా ప్రదర్శనలను తిలకించారు. ఈ కార్యక్రమంలో సృష్టి డ్యాన్స్ అకాడమీకి చెందిన గురువు సుష్మ ఉదయ్, బాలికలు కీర్తన, హర్షిణి, ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు.

యాదగిరి క్షేత్రంలో కోలాహలం