
శిథిల భవనం.. సిబ్బందిలో భయం
యాదగిరిగుట్ట రూరల్: వానాకాలానికి ముందు శిథిలావస్థకు చేరిన ప్రైవేట్ భవనాలను గుర్తించి కూలుస్తున్న అధికారులు.. అదే కాలం చెల్లిన ప్రభుత్వ భవనాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎప్పుడు కూలుతాయోనన్న రీతిలో ఉన్న భవనాల్లో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సాధకబాధకాలను మాత్రం వదిలేస్తేన్నారు. యాదగిరిగుట్ట వ్యవసాయ కార్యాలయానికి నూతన భవనం నిర్మించాల్సిన ఆవశ్యకత ఉన్నా గాలికొదిలేస్తున్నారు. వర్షాలకు స్లాబ్, గోడలు కురిసి కంప్యూటర్, ఫైళ్లు తడుస్తున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముగ్గురు అధికారులకు ఒక్కటే గది
కార్యాలయంలో ఒకే గది ఉంది. అందులోనే ఏడీఏ, ఏఓ, ఏఈఓ విధులు నిర్వహిస్తున్నారు. రైతులు కూర్చోడానికి చోటు కూడా లేదు. ఉన్నతాధికా రులు స్పందించి కార్యాలయాన్ని మరో చోటకు తరలించాలని కోరారు.

శిథిల భవనం.. సిబ్బందిలో భయం