
సినిమా సెట్టింగ్‌లా దుర్గాదేవి మండపం
భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి మండల పరిధిలోని పెద్దగూడెం గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం సినిమా సెట్టింగ్‌ను తలపిస్తోంది. మండపం బయట శివపార్వతులు, నందీశ్వరుడి విగ్రహాలతో పాటు మండపం సెట్టింగ్ పైన పలు దేవతా విగ్రహాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అదేవిధంగా ఈ మండపం వద్ద ఉత్సవ నిర్వాహకులు భక్తులకు లక్కీ డ్రా ఆఫర్లు పెట్టారు. రూ.201 చెల్లించి కూపన్ కొనుగోలు చేసిన భక్తులకు అక్టోబర్ 3న నిర్వహించే బంపర్ డ్రాలో మొదటి బహుమతిగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్, రెండో బహుమతిగా కలర్ టీవీ, మూడో బహుమతిగా కుక్కర్ ఓవన్, నాల్గవ బహుమతిగా 3 గ్రాముల సిల్వల్ కాయిన్ అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సినిమా సెట్టింగ్‌లా దుర్గాదేవి మండపం