
పిల్లలమర్రి ఆలయాల సందర్శన
సూర్యాపేట: సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామంలోని రాష్ట్ర రక్షిత కట్టడాలైన నామేశ్వర ఆలయం, ఎరకేశ్వర దేవాలయాన్ని ఆది వారం రాష్ట్ర పురా వస్తు శాఖ సంచాలకుడు అర్జునరావు కుతాడి సందర్శించారు. ఆలయాల స్థితిగతులను పరిశీలించడంతో పాటు వాటి అభివృద్ధి కోసం ఏం చేయాలని పురావస్తు శాఖ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భక్తులకు, పర్యాటకులకు ఆలయాల చరిత్ర తెలియజేసే విధంగా సైన్ బోర్డులు, వివరణాత్మక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఆలయ గోడలపై ఉన్న వైట్‌వాష్‌ను వెంటనే రసాయనాలతో శుద్ధి చేసి శిల్ప సంపదను, చరిత్రను భక్తులు, పర్యాటకులు స్పష్టంగా చూడగలిగేలా చేయాలన్నారు. ఆలయంలో ఉన్న శాసనాల వివరాలను కూడా బోర్డుల రూపంలో ప్రదర్శించి చరిత్రకారులకు, పర్యాటకులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. పర్యాటకులకు ఆలయ చరిత్ర వివరించడానికి ఒక టూరిస్ట్ గైడ్‌ను కూడా నియమించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సంచాలకులు డాక్టర్ పి. నాగరాజు, ఎన్. నర్సింగ్‌నాయక్, మహాత్మాగాంధీ యూనివర్సిటీకి చెందిన చరిత్రకారులు డాక్టర్ షరీఫ్, రామకృష్ణ, డాక్టర్ కిషోర్, ఇర్ఫాన్ పాల్గొన్నారు.