
మరింత కుంగిన మోత్కూరు చెరువు కట్ట రోడ్డు
మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని పెద్ద చెరువు కట్ట రోడ్డు (మినీ ట్యాంక్‌బండ్) మరింత కుంగింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో చెరువు కట్ట రోడ్డు ఒక పక్కకు ఒరుగుతూ కుంగుతోంది. చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పోస్తుండడం.. మోత్కూరు, తిరుమలగిరి, తొర్రూరు, సూర్యాపేటకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో పాటిమట్ల నుంచి అనాజిపురం మీదుగా మోత్కూరు పట్టణానికి బస్సులను దారి మళ్లించారు. పోలీసులు చెరువు కట్ట వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. కుంగిన రోడ్డును నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ కె. సతీష్‌కుమార్, నీటిపారుదల శాఖ ఏఈలు అఖిల్, చంద్రశేఖర్, ఆర్‌అండ్‌బీ ఏఈ మెంట స్వామి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్‌ఐ సతీష్ తన సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. పొడిచేడు–అమ్మనబోలు గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది బ్రిడ్జి వద్ద పోలీసు పహారా ఏర్పాటు చేశారు.
ఫ తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన
నీటిపారుదల శాఖ అధికారులు