
ఏటీసీలతో ఉద్యోగ అవకాశాలు
భువనగిరి : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో రూ. 42.5 కోట్లతో నిర్మించిన అడ్వా న్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను శనివారం ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటీసీ వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి,ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నిరుద్యోగుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ సాంకేతిక కోర్సులతో మంచి భవిష్యత్ ఉంటుందని, ఏటీసీలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏటీసీ ప్రిన్సిపాల్ జయ, ట్రైనింగ్ ఆఫీసర్ రమణానంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవెజ్ చిస్తీ, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ భావన, సిబ్బంది పాల్గొన్నారు.