సీడీపీఓ విచారణ | - | Sakshi
Sakshi News home page

సీడీపీఓ విచారణ

Sep 28 2025 6:47 AM | Updated on Sep 28 2025 6:47 AM

సీడీప

సీడీపీఓ విచారణ

యాదగిరిగుట్ట రూరల్‌: పట్టణంలోని డ్రెయినేజీ సమీపంలో పడేసిన బాలామృతం ప్యాకెట్లను శనివారం సీడీపీవో స్వరాజ్యం పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సీసీ కెమెరాల్లో చూడాలని ఫిర్యాదు చేశారు. అనంతరం పట్టణంలోని అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. తప్పులకు తావు లేకుండా సరైన సమయంలో లబ్ధిదారులకు పౌష్ఠికాహారం అందజేయాలని సూచించారు. ఆమె వెంట సూపర్‌వైజర్‌ జంగమ్మ తదితరులు ఉన్నారు.

సబ్‌జైల్‌ను సందర్శించిన జిల్లా ప్రధాన జడ్జి

భువనగిరిటౌన్‌ : భువనగిరిలోని సబ్‌జైల్‌ను శనివారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు జయరాజు సందర్శించారు. జైలులతో వసతులను పరిశీలించారు. ఖైదీలతో ముఖాముఖి నిర్వహించి జైలులో కల్పిస్తున్న వసతులు, న్యాయ సహాయం తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వారు ఉచిత న్యాయ సహాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి.మాధవిలత, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి.ముక్తిద, జైలు సూపరింటెండెంట్‌ పాల్గొన్నారు.

హోటల్‌ వివేరాకు అవార్డు

భువనగిరి: జిల్లా కేంద్రంలోని హోటల్‌ వివేరాకు ఉత్తమ వేసైడ్‌ అమినిటిస్‌ అవార్డు లభించింది. పర్యాటకులకు ఆధునిక సదుపాయాలు అందిస్తూ రాష్ట్ర టూరిజం శాఖ అభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా హోటల్‌కు అవార్డు లభించింది. శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కా ర్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదగా వివేరా హోటళ్ల చైర్మన్‌ సద్ది వెంకట్‌రెడ్డి, డైరెక్టర్‌ రాఘవేందర్‌రెడ్డి అ వార్డు అందుకున్నారు.

దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తులపై చర్య తీసుకోవాలి

భూదాన్‌పోచంపల్లి: మాజీ మంత్రి హరీష్‌ రావు పేరు చెప్పి తమ కాలేజీలోకి అ క్రమంగా జేసీబీలతో చొరబడి దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవా లని సెయింట్‌మేరీస్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ కేవీకే రావు కోరారు. శనివారం పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని సెయింట్‌మేరీస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం శివ, శంకర్‌, రవి అనే ముగ్గురు వ్యక్తులు మూడు జేసీబీలతో కాలేజీలోకి అక్రమంగా చొరబడి చెట్లను నరికారని పేర్కొన్నారు. రౌడీయిజంతో కాలేజీ స్టాఫ్‌, విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేస్తుంటే పోలీసులు, ఫారెస్ట్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరో పించారు. కళాశాల సిబ్బంది జేసీబీలకు అడ్డుపడగా అక్కడ నుంచి వెళ్లిపోతూ హరీష్‌రావు బంధవులైన రామారావు, వినోద్‌తో ఆదివారం లోగా భూమి సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని, లేనిపక్షంలో విధ్వంసం చేస్తామని హెచ్చరించారని తెలిపారు. ఇదే విషయమై శనివారం రాచకొండ సీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు అన్నారు. పోలీసులు తమ ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు.

సీడీపీఓ విచారణ1
1/2

సీడీపీఓ విచారణ

సీడీపీఓ విచారణ2
2/2

సీడీపీఓ విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement