
ధాన్యం కొనుగోళ్లలో పోచంపల్లి ఫస్ట్
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో 3.60 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం భూదాన్‌పోచంపల్లిల పీఏసీఎస్ అర్థవార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద షెడ్‌ల నిర్మాణం చేపడ్టుతున్నామని తెలిపారు. ధాన్యం కమీషన్ ద్వారా వచ్చిన రూ.50ల క్షలతో గోదాం, ప్రహరీ నిర్మించామని చెప్పారు. రైతులు, పాలకవర్గం సహకారంతో పీఏసీఎస్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. పోచంపల్లి పీఏసీఎస్‌ను లాభాలబాటలో నడిపిస్తూ జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దామని చెప్పారు. గతంలోనూ అనేక రికార్డులు నెల కొల్పామని గుర్తు చేశారు. భవిష్యత్‌లో కూడా రైతులు పాలకవర్గానికి అన్ని విధాలా సహకారం అందించాలని భూపాల్‌రెడ్డి కోరారు. అనంతరం 2025–26 వార్షిక బడ్జెట్‌ను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో వైస్‌చైర్మన్ సామ మోహన్‌రెడ్డి, సీఈఓ సద్దుపల్లి బాల్‌రెడ్డి, డైరెక్టర్లు మద్ది చంద్రారెడ్డి, నల్ల కిష్టమ్మ, రామసాని చంద్రశేఖర్‌రెడ్డి, రాజమల్లేశ్, మైల గణేశ్, ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి, కూసుకుంట్ల అలివేలుమంగ కొండల్‌రెడ్డి, ఎడ్ల సహదేవ్, సత్తయ్య, గుర్రం నర్సిరెడ్డి, సిబ్బంది శ్రీధర్, నాని, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
ఫ పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి