
మూసీకి వరద పోటు
భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ, మోత్కూరు, రామన్నపేట: హైదరాబాద్‌లోని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, గండిపేట చెరువు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయడంతో మూసీకి వరద పోటెత్తింది. శుక్రవారం రాత్రి నుంచే భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు, రుద్రవెల్లి గ్రామాల మధ్య లోలెవల్ బ్రిడ్జిపై నుంచి వరద ఉధృతి కొనసాగింది. భారీవరదతో అధికారులు అప్రమత్తమయ్యారు. బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. వయా పెద్దరావులపల్లి మీదుగా దారి మళ్లించారు. 20 ఏళ్ల తరువాత మూసీకి ఇంత పెద్ద మొత్తంలో వరద పోటెత్తిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. వరద ప్రభావం భారీగా ఉండటంతో మూసీ నది వెంట ఉన్న జూలూరు, కప్రాయిపల్లి, పెద్దరావులపల్లి, ఇంద్రియాల గ్రామాల్లో వరిపొలాలు నీటమునిగాయి. మండలంలోని చెరువులన్నీ నిండి జలకళను సంతరించుకొన్నాయి. అదే విధంగా వలిగొండ మండలం సంగెం భీమలింగం వద్ద, రామన్నపేట మండలం లక్ష్మాపురం మధ్య వంతెనలపై నుంచి మూసీ పరవళ్లు తొక్కుతోంది. మో త్కూరు మండలం పొడిచేడు, నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు మధ్య గల బ్రిడ్జి వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది.
రామన్నపేట : లక్ష్మాపురం వద్ద..